Astrology Weekly Horoscope Details

Notifications

వృషభం వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై గ్రహాల ప్రభావం అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేయండి. భార్యాభర్తల మధ్య అకారణ కలహం. బంధుమిత్రులతో పట్టింపులు ఎదుర్కుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ సమస్యగా అనుకోవద్దు. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఆశావహ దృక్పథంతో మెలగండి. దైవదర్శనాల్లో అవస్థలు ఎదుర్కుంటారు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి అంతర్జాతీయ ప్రచారం.. నిజమేనా.. పెయిడ్ వ్యవహారమా?

Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతి

Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతిబాలానగర్ ఫ్లైఓవర్‌పై స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై, ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఇనుప కడ్డీ పడటంతో అతను మరణించాడు. బాలానగర్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ట్రాలీ ఆటో డ్రైవర్ నయీమ్ పాషా బాలానగర్‌లోని ఒక స్టీల్ షాపులో ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి రాణిగంజ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద ఫతేనగర్ సమీపంలో ఆటో యు-టర్న్ తీసుకుంటున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం నుండి అకస్మాత్తుగా ఒక ఇనుప కడ్డీ కింద పడి, స్కూటర్‌పై వెళ్తున్న ప్రకాష్ పవార్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పవార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?మహాలయ అమావాస్య వ్రతానికి వంట చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు వంటి వాటిని పూర్తిగా నివారించాలి. క్యాబేజీ, ముల్లంగి, ఆకుకూరలు వంటి కూరగాయలను అమావాస్య వంటలో కలపకూడదు. మహాలయ అమావాస్య రోజున, కోడిగుడ్డుతో సహా మాంసాహారం తినడం గానీ, మద్యం సేవించడం గానీ లేదా ధూమపానం చేయడం గానీ చాలా పెద్ద పితృ దోషాన్ని కలిగిస్తుంది. ఉదయం పూర్వీకులకు తర్పణం ఇచ్చి, కాకికి అన్నం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు భోజనం చేయాలి. అంతకు ముందు తినకూడదు. అమావాస్య రోజున ఉదయం వేళ గడపలో ముగ్గు వేయకూడదు. పసుపు కలిపిన నీటిని కూడా గడపలో చల్లకూడదు. ఉదయం పితృదేవతలకు తర్పణం ఇచ్చే వరకు పూజా గదిలో దీపం వెలిగించి పూజ చేయకూడదు.

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్

Navaratri Home Mandir Vastu 2026: నవరాత్రి.. ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు.. వాస్తు టిప్స్నవరాత్రి అనేది దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే ముగ్గురు అమ్మవార్లను ఇంటికి ఆహ్వానించి, పూజించి, వారి అనుగ్రహాన్ని పొందే సమయం. అందువల్ల కలశం ఏర్పాటు చేసి, ఇంట్లో అమ్మవారిని కొలువుదీర్చే ముందు ఇంట్లో ఉన్న వాస్తు దోషం, ప్రతికూల శక్తులను తొలగించి, దైవ శక్తిని అడ్డుకునే వస్తువులను బయటకు పంపించాలని చెప్పబడుతుంది. నవరాత్రికి ముందు బయటకు తొలగించాల్సిన ఏడు వస్తువులు: విరిగిన విగ్రహాలు-విరిగిన, పగుళ్లు వచ్చిన లేదా రంగు వెలిసిపోయి పాడైన దేవుడి విగ్రహాలు, ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించగలవు. దీని వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళాలు పెరుగుతాయి. అందువల్ల వీటిని గౌరవంగా ప్రవహించే నీటిలో తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు. లేదా తులసి మొక్క కింద పాతిపెట్టవచ్చు.