1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జులై 2025 (12:54 IST)

Shubman Gill: టెస్టు క్రికెట్ గురించి శుభమన్ గిల్ ఓల్డ్ వీడియో వైరల్

Gill
Gill
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 269 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ పరుగులతో గిల్ ఖాతాలో రికార్డుల పంట పండింది. ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్‌లో గిల్ పలు రికార్డులను నెలకొల్పి సంచలనం సృష్టించాడు.
 
గతంలో 2019లో విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు భారత కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరుగా ఉండేది. ఈ మ్యాచ్‌లో గిల్ ఈ రికార్డును తిరగరాశాడు. 269 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
 
ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌లలో గిల్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. 
250 పరుగుల మార్క్‌ను తాకిన తొలి భారత బ్యాటర్‌గా గిల్ అరుదైన రికార్డు
 
మరోవైపు తన అద్భుతమైన ప్రదర్శనలతో, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో శుభ్‌మాన్ గిల్ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతున్న పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. "'ఇది టెస్ట్ క్రికెట్ అని మనం గుర్తుంచుకోవాలి, మీరు ముందుగానే అవుట్ అయితే, మీరు బయట కూర్చోవలసి ఉంటుంది.'

"మీరు క్రీజులో ఎంత ఎక్కువగా ఉంటే, మీరు అంత ఎక్కువ పరుగులు చేస్తారు. మీరు బయట కూర్చుని పరుగులు సాధించలేరు. కాబట్టి, నేను గాలిలో షాట్లు ఆడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాకు వదులుగా ఉన్న బంతి దొరికితే తప్ప నేను గ్రౌండెడ్ షాట్లు ఆడటానికి ఎక్కువగా ప్రయత్నిస్తాను. నా అంతిమ లక్ష్యం భారతదేశం తరపున ఆడటం" అని శుభ్‌మన్ గిల్ క్లిప్‌లో అన్నారు. ఈ వీడియోను గిల్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.