1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India vs England: First time in history! Team India creates unprecedented Test record

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ ఖాతాలో చెత్త రికార్డు!

india test team
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్‌కు తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చిత్తు
గా ఓడిపోవడమేకాకుండా, ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 
 
భారత్ నిర్ధేశించిన 371 పరుగులు విజయలక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లుకోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 
 
ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసి ఓటమిపాలైన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ళు ఐదు సెంచరీలు నమోదు చేశారు. రిషభ్ పంత్ (134, 118) రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేయగా, యశస్వి జైశ్వాల్ (101), శుభమన్ గిల్ (147), కేఎల్ రాహుల్ (137)లు శతకాలు చేశారు. 
 
అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928/29లో జరిగిన యాషెస్ మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు చేసినప్పటికీ ఆ జట్టు ఓడిపోయింది. డాన్ బ్రాడ్‌మెన్ ఆ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేశాడు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 800 పాయింట్లతో తొలి భారత వికెట్ కీపర్‌గా అదుర్స్