1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జులై 2025 (21:41 IST)

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

victim
భర్తను కోల్పోయిన కోడలికి అండగా ఉండాల్సిన అత్తమామలే ఆమెను అమ్మేసిన దారుణమైన ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను కొనుగోలు చేసిన వ్యక్తి, రెండేళ్లపాటు శారీరకంగా, మాసికంగా వేధించి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలిని గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అర్ని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలిని భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయారు.
 
ఆమె తన కుమారుడు, కుమార్తెతో అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. దీంతో అత్తమామలు బాధితురాలిని అమ్మేందుకు కుట్ర పన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తితో లక్ష ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఆమెను అప్పగించారు. బాధితురాలిని ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.