1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జులై 2025 (09:24 IST)

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

video filming
భార్య బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా కట్టుకున్న భార్త న్యూడ్ వీడియో తీశాడు. ఆ తర్వాత డబ్బు కోసం ఆమెనే బెదిరించసాగాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించసాగాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణె నగరం, అంబేగావ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణిగా 30 యేళ్ల మహిళ పనిచేస్తుంది. ఆమెకు మరో ప్రభుత్వ ఉద్యోగితో 20 యేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఆమె ఇంటిలో స్నానం చేస్తుండగా భర్త సీక్రెట్ కెమెరాతో వీడియో తీశాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించసాగాడు. ఈ బెదిరింపులు ఎక్కువకావడంతో ఆమె పోలీసులను ఆశ్రంచారు. ఇటీవల తాను స్నానం చేస్తుండగా తన భర్తే రహస్య కెమెరాలతో న్యూడ్ వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 
 
కారు, ఇంటి రుణం చెల్లించడానికి తనకు డబ్బులు కావాలని అందుకోసం పుట్టింటి నుంచి 1.5 లక్షలు తీసుకుని రావాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆమె తెలిపారు. లేదంటే తీసిన వీడియోలను బయటపెడతానని బెదిరించినట్టు వాపోయారు. ఇలా తనను మానసికంగా, శారరకంగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. భర్త కుటుంబీకులు సైతం ఆయనకే వత్తాసు పలుకుతూ తనను వేధిస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.