1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 23 జులై 2025 (12:13 IST)

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

Teja Sajja and Ritika Nayak
Teja Sajja and Ritika Nayak
హనుమాన్ కథానాయకుడు తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ చేశారు. ఈరోజు ఓ పోస్టర్ విడుదల చేస్తూ లిరికల్ వీడియో జూలై 26న విడుదల కానుందని ప్రకటించారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కలయికలో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ లెవెల్ చిత్రమే “మిరాయ్”. హను మాన్ కి పనిచేసిన సంగీత దర్శకుడు గౌర హరి సంగీతం అందించారు.

పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్ ని ఒకేసారి విడుదల చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో రూపొందుతున్న మిరాయ్ ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
 
ఈ సినిమాలో మంచు మనోజ్, రితికా నాయక్ తదితరులు నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని, విశ్వ ప్రసాద్‌టిజి, కృతి ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, సుజిత్ కొల్లి, మణిబ్కరణం, శ్రీనాగేంద్ర సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు.