1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జులై 2025 (22:37 IST)

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Tamannah
Tamannah
ఇటీవల బాగా బరువు పెరిగిన తమన్నా భాటియా ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ప్రేమలో మునిగిపోయి, వివాహం జరగనుందనే ఆనందంలో మునిగిపోయిన తమన్నా.. తన సాధారణ ఫిట్‌నెస్ దినచర్యకు విరామం ఇచ్చినట్లు అనిపించింది. 
 
అయితే, నటుడు విజయ్ వర్మతో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న సంబంధం బ్రేకప్ కావడంతో తమన్నా ఫిట్‌నెస్‌పై మళ్లింది. కెరీర్ పరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో హ్యాపీగా వర్కౌట్లు చేసుకుంటూ.. తిరిగి తన శరీరాకృతిని మెరుగుపరుస్తోంది.
 
ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఈ నటి మరోసారి తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆమె తిరిగి చేసిన ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నాయి. ఆమె ఇటీవల జిమ్ నుండి వ్యాయామం తర్వాత తీసుకున్న సెల్ఫీని షేర్ చేసింది. ఈ ఫోటోలో తమన్నా నాజూగ్గా కనిపించింది. 
Tamannah
Tamannah
 
సినీ అవకాశాలతో తమన్నా నటిగా బిజీగా మారాలని.. దీనికోసం నాజూగ్గా తయారవుతోంది. ప్రస్తుతం తమన్నా స్లిమ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.