ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
అధిక బరువు(Obesity) ఉన్నవారు లేదా పొగతాగే అలవాటు ఉన్నవారు, వైద్యుల సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మాత్రలు(Painkillers) వాడేవారు కూడా కిడ్నీ టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే వీరికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని చెబుతున్నారు.

