కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
1. చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబందం ఉన్నది. అందువల్ల మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
2.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్దాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్దాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.
3.కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్ద్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్దాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది.
4. కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తిచేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ కిడ్నీల పని తీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట, మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్బంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే వీపు బాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాదారణ సంకేతం.
5. ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్ పెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ వుంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.