శుక్రవారం, 4 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జులై 2025 (22:23 IST)

ద్విశతకం బాదేసిన శుభమన్ గిల్.. భారత్ స్కోరు 587 ఆలౌట్

gill
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌‍లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించాడు. ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారభించిన భారత్... 587 పరుగులు చేసింది. గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 269 పరుగులు చేశాడు. ఓవర్ నైట్ స్కోరు 41తో క్రీజ్‌‍లోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా రాణించాడు.137 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 89 పరుగులు చేసి సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. 
 
గిల్, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలగే, గిల్, సుందర్ జోడీ ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించింది. తొలి రోజే యశస్వి జైశ్వాల్ 87 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.