కోన్ ఐస్ క్రీమ్, కుల్ఫీలు 2016-17 బడ్జెట్‌కు ముందే బాగా లాగించేయండి....

icr cream
ivr| Last Modified సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (13:26 IST)
ఈ బడ్జెట్ 2016-17 తర్వాత మీ కుటుంబ బడ్జెట్ కాస్త పెరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా గ్రీన్ టీ, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్, పాస్తా, ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్, సోయా మిల్క్ తదితర పదార్థాలపైన ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా 12.5 శాతం చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

కాగా వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ పన్ను విధింపు ఉన్నది. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పై పదార్థాలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఐస్ క్రీం వంటివి ఈ ఎండాకాలంలో తినాలంటే చాలా హీటెక్కిపోవడం ఖాయం. ఐతే ఈ పదార్థాలపై సిఫార్సు చేసిన పన్ను విధింపు శాతం తొలుత 17-18 శాతంగా నిర్ణయించాలని అనుకున్నా... ఆ తర్వాత 12 శాతానికి విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :