2016 రైల్వే బడ్జెట్: దేశాభివృద్ధికి వెన్నెముకలా ఉంటుంది: సురేశ్ ప్రభు

suresh prabhu
Selvi| Last Updated: గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:17 IST)
2016 రైల్వే బడ్జెట్ సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. లోక్ సభలో సురేశ్ ప్రభు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల అంచనాల్ని, కోరికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ని తయారు చేశామన్నారు. ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్‌ అంటూ వ్యాఖ్యానించారు. కలిసికట్టుగా కృషి చేసి రైల్వేల్ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.

రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయ మార్గాల ప్రాతిపదికన బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందని సురేశ్ ప్రభు వ్యాఖ్యానించారు. బడ్జెట్ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కవితను చదివి చూపించారు. దేశాభివృద్ధికి వెన్నెముకలా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగుపరుస్తామని, ఈ బడ్జెట్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :