గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By preeti
Last Modified: గురువారం, 4 మే 2017 (13:19 IST)

పిల్లల మెదడులో ఆ నాలుగు ఉంటే...

బిడ్డ పుట్టినప్పుడు వారి మెదడు సంపూర్ణంగా ఏర్పడి ఉండదు. బిడ్డ పెరిగే కొద్దీ మెదడు కూడా పెరుగుతూ వస్తుంది. తండ్రి గిలిగింతలు పెట్టిన ప్రతిసారి, తల్లి చిరునవ్వును చూసిన ప్రతిసారి, బిడ్డ మెదడులోని న్యూరాన్‌లు సినాప్సిస్ అనే కొత్త అనుసంధానాన్ని స్థాపిస్త

బిడ్డ పుట్టినప్పుడు వారి మెదడు సంపూర్ణంగా ఏర్పడి ఉండదు. బిడ్డ పెరిగే కొద్దీ మెదడు కూడా పెరుగుతూ వస్తుంది. తండ్రి గిలిగింతలు పెట్టిన ప్రతిసారి, తల్లి చిరునవ్వును చూసిన ప్రతిసారి, బిడ్డ మెదడులోని న్యూరాన్‌లు సినాప్సిస్ అనే కొత్త అనుసంధానాన్ని స్థాపిస్తాయి. ఆరేళ్లు వచ్చేసరికి మెదడు అనేక సినాప్సిస్‌లతో దట్టంగా మారుతుంది. బిడ్డ మెదడులో ఇలాంటి అనుసంధానాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. 
 
ఇవి భాషను నేర్చకోవడం, క్రీడాకారుడు లేదా గణిత శాస్త్రజ్ఞుడు కావడం లేదంటే ఏదైనా అంశంపై ఆసక్తి పెంచుకోవడంలో దోహదపడతాయి. బాల్యంలోనే పిల్లల మెదడును శక్తివంతంగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలి. ఒక గదికి నాలుగు గోడలు ఉన్నట్లుగానే పిల్లల మెదడుకి కూడా అభిజ్ఞాతం, మానసికం, శారీరకం మరియు సామాజికం అనేవి నాలుగు గోడలు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా వృద్ధి చెందకపోయినా మెదడు నిర్మాణంలో ఒక కీలకమైన అంశాన్ని కోల్పోయినట్లే. కనుక చిన్న వయస్సులోనే పిల్లల మెదడులో ఇవి వృద్ధి చెందేలా చేస్తే వారు ఏ రంగంలోనైనా చురుగ్గా రాణిస్తారు.