గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (17:18 IST)

శిశువుకు పాలే కాకుండా నీళ్లు కూడా ఇవ్వొచ్చా..?

20 లేదా 30 రోజుల శిశువుకు పాలతో పాటు నీళ్లు కూడా ఇవ్వొచ్చా..? ఇవ్వకూడదా? అనేది తెలియాలంటే.. ఈ కథనం చదవండి. పిల్లలకు 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా పాలు పట్టించాలి. చిన్నారి నిద్రపోతున్నప్పటికీ 3 గంటలకోసారి పట్టించాలి. పిల్లల పెరుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనది. శిశువు పెరిగే కొద్దీ పాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని వైద్యుల సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది.  
 
అయితే శిశువులకు పట్టే పాలలోనే నీరుండటంతో.. ప్రత్యేకంగా నీరు ఇవ్వడం అవసరం లేకపోయినా... పాలతో పాటు అప్పుడప్పుడు పుట్టిన శిశువుకు నీరు స్పూన్ల లెక్కన ఇవ్వడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాలు పట్టిన గంటసేపు తర్వాత బాగా మరిగించి ఆరబెట్టిన నీటిని గోరు వెచ్చగా... రెండేసి స్పూన్లు ఇవ్వడం మంచిది. పాలే కాకుండా నీరు ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల ఉంటుంది. పాలతో పాటు నీరు తీసుకునే పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.