Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పిల్లల్లో బలం కోసం.. పచ్చని అరటి, కేరళ అరటిపండు ఇవ్వండి

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:39 IST)

Widgets Magazine

పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా రోజుకో పండును ఇవ్వాలి. పిల్లలు లావెక్కకపోతే.. గ్రీన్ బనానా, కేరళ అరటిపండు ఇవ్వడం మంచిది. ఇచ్చే పండులో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను పిల్లలకు తినిపించవచ్చు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికొచ్చాక కాసేపు హోం వర్క్ చేసుకోవడం, లేదంటే టీవీ చూడటం వంటి వాటితోనే సమయం గడిచిపోతోందా? ఇలా కాకుండా వారికి నచ్చిన విధంగా కథల పుస్తకాలు, డ్రాయింగ్, పాటలు వినడం వంటివి చేయిస్తే వారిలో మార్పులు వస్తాయి. 
 
పిల్లల్ని వంటగదిలోకి రానివ్వండి. చిన్న చిన్న పనులు అలవాటు చేయండి. కూరగాయల్ని శుభ్రంగా కడిగి ఇవ్వమనడం, డైనింగ్ టేబుల్ తుడవడం వంటివి అలవాటు చేస్తే సరిపోతుంది. జంక్ ఫుడ్ కాకుండా పోషక విలువలున్న ఆహారం ఇవ్వండి. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. ఒకే పాదులో పదిమొక్కలు తలెత్తినట్లు, కౌమారంలో పిల్లల్లో ఏకకాలంలో ఎన్నెన్నో ఆలోచనలు పుడుతుంటాయి. వారికి స్నేహితులుగా వారి భావోద్వేగాలను అడిగి తెలుసుకోవాలి. 
 
టీనేజ్ పిల్లలను ఇతరుల ముందు అవమానించకూడదు. టీనేజర్ల మౌనాన్ని, ఏకాంత వాసాన్ని తల్లిదండ్రులు గౌరవించాలి. ఏకాంతం ఏకాగ్రతకు మార్గమైతే, మౌనం వేయి మాటలకు సమానం. హానికరం కాకుండా.. ఏకాంతంగా ఉండే పర్లేదనుకోండి. పిల్లల మధ్య సహృధ్భావాన్ని ఏర్పరచడంలో తల్లితండ్రులు విఫలమయితే కనుక పిల్లలు ఇతరుల ఎదుగుదల చూసి ఇంకొకళ్ళు ఓర్వలేకపోవడం, అసూయ పడటం వంటివి చేస్తారు. వారిలో అసూయ ఏర్పడుతుంది. 
 
పిల్లలకు కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్లులో ఉన్న ఐరన్, ఇతర విటమిన్స్ పిల్ల మెదడు ఆరోగ్యానికి మెమరీ మూల కణాల నిర్మాణానికి చాలా అవసరం అవుతుంది. మెదడులో ఎక్కువ కణాలు ఉన్నప్పుడు, మరింత మెరుగైన స్మృతి అలవడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో గుడ్డును చేర్చుకోవాలి. 
 
పిల్లలకు రోజూ అరకప్పు పెరుగు అలవాటు చేయాలి. ఓట్‌మీల్ కూడా ఇవ్వాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దాంతో తిన్న ఆహారం చాలా నిదానంగా జీర్ణం అవుతుంది. పెరుగుతున్న పిల్లలో ఒక స్థిరమైన శక్తి సామర్థ్యాలు పొందడానికి సహాయపడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Green Banana Kerala Banana Junk Food Oat Meal Child Care Tips

Loading comments ...

బాలప్రపంచం

news

బుడతడు కాదు... చిచ్చరపిడుగు... కళ్ళకు గంతలు కట్టుకుని కీబోర్డు వాయించాడు...

చెన్నై నగరానికి చెందిన ఓ బుడుతడు ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. కళ్లకు గుడ్డ ...

news

పిల్లలను ఒత్తిడికి గురిచేయకండి.. ఇతరులతో పోల్చకండి..

పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే.. ఇతరులతో పోల్చడం మానేయాలి. చిన్నారుల్లో భావోద్వేగాలు, ...

news

పిల్లలకు రోజూ ఓ ఆమ్లెట్ ఇస్తున్నారా? నిల్వచేసిన స్నాక్స్ వద్దే వద్దు..

పిల్లలకు అన్నీ రుచులను చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. ఆహార పదార్థాల్లోని రుచిని, అందులోని ...

news

వేసవి కాలంలో పిల్లలకు పోషకాహారం ఇవ్వండి.. ఈ జావను తాగిస్తే..?

వేసవి కాలంలో చిన్నారుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. టీకాలను సకాలంలో వేయాలి. పండ్లు, ...

Widgets Magazine