శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 జనవరి 2015 (16:01 IST)

పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే తేనే!

పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని తేనె పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు ఇచ్చే ఆహార పదార్థాల్లో తేనె కలపడం ద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతల నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
 
తేనెను పిల్లల డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. హనీని పిల్లలకు ఆహారంలో కలపకుండా స్పూన్‌తో డైరక్ట్‌‌గా ఇవ్వడం చేస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
ఇంకా పిల్లల్లో పీడిత దగ్గును కూడా తేనె దూరం చేస్తుంది. పిల్లల్లో తెలుపు రక్త కణాల సంఖ్యను తేనె పెంచుతుంది. క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. 
 
కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. తేనెలోని విటమిన్స్, మినిరల్స్ పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇందులోని అమినో ఆసిడ్స్ పిల్లల భౌతిక ఎదుగుదలకు సహకరిస్తుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది.