సంబంధిత వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్స్, కొత్తగా 1,196 పాజిటివ్ కేసులు
- కరోనా ప్రభావం, దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ విస్తరణ, 234 వైద్య ప్రక్రియలకు ఉచిత చికిత్స: వైఎస్ జగన్
- చిరంజీవిని కరోనా వైరస్ ఎక్కడ కాటేసిందబ్బా? ఆరా తీస్తున్న ఫ్యాన్స్!
- కరోనా నుండి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు, కేరళ సర్కార్ విజ్ఞప్తి
ఏపీలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 1,836 కేసులు
ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో ఏపీలో 1,836 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,910 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,836 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,46,245కి చేరింది. కరోనా వైరస్ మరణాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది.
గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 12 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా లో ముగ్గురు, అనంతపురంలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, ప్రకాశం లో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,814 కి చేరింది.
రాష్ట్రంలో డిశ్చార్జి లు భారీగా పడిపోయాయి. మంగళవారం 2,151 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,18,473 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 20,958 యాక్టివ్ కేసులున్నాయి.
తర్వాతి కథనం
