సంబంధిత వార్తలు
- కరోనా కష్టకాలంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై పిడుగు
- కరోనావైరస్: విజయవాడలో 40 శాతం మందికి వచ్చిపోయిన కోవిడ్-19 : ప్రెస్ రివ్యూ
- ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కింద ముందుగానే కరోనా వ్యాక్సిన్...
- జిత్తులమారి కరోనా... చిక్కకుండా రక్షణ కవచాలు : కొత్త కేసుల్లో నయా రికార్డు
- భాగ్యనగరికి ఏమైంది? ... హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి వెళ్లిపోయిందా?
పెళ్లికొడుకుతో పాటు 9మందికి కరోనా.. పెళ్లికూతురికి మాత్రం నెగటివ్..
వివాహ వేడుకలకు పరిమితంగా సభ్యులు హాజరు కావాలని నిబంధలున్నప్పటికీ.. జనాలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అలాగే చాలా ఫంక్షన్లలో కరోనాకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీని ఫలితంగా ప్రజలు కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మమత వెల్లడించారు. దీంతో... అందరినీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఇలా 9 మందికి కరోనా సోకడానికి కారణం వారి ఇంట జరిగిన వివాహమేనని తేలింది. ఇటీవలే ఈ ఇంట్లో వివాహం జరిగింది. అయితే, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పెళ్లి కుమారుడు సహా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. పెళ్లి కూతురికి మాత్రం నెగిటివ్‌గా వచ్చింది.
తర్వాతి కథనం
