సంబంధిత వార్తలు
- లాక్‌డౌన్ ఎఫెక్టు.. వందల కిమీ నడక ... ఆకలితో అలమటించి శ్వాస విడిచిన అబల.. ఎక్కడ?
- మర్కజ్ జమాత్ చీఫ్ ఆచూకీ లభ్యం.. అరెస్టు తప్పదా?
- లాక్‌డౌన్ వేళ బిలియనీర్ అయిన భారతీయుడు ఎవరు?
- కరోనా వైరస్ కల్లోలం, భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు
- కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌కు అడ్డాగా కర్నూలు, 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే
ఏ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్‌తో ముప్పు?
ఇపుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ రెండు గ్రూపుల వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇతర బ్లడ్ గ్రూపుల వారి కంటే.. 'ఒ' మరియు 'ఎ' గ్రూపులకు చెందిన వారిలోనే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని తేలింది. కరోనా వైరస్ బారినపడిన రెండు వేల మంది పాజిటివ్ రోగులకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలోని వుహాన్, షెంజెన్ నగరాల్లో జరిగింది.
అయితే, ఏ బ్లడ్ గ్రూపు వారి కంటే.. ఓ బ్లడ్ గ్రూపువారిలోనే ఈ వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. పైగా, ఈ రెండు గ్రూపుల వారిలోనే ఈ వైరస్ ఎందుకు వ్యాపిస్తుందన్న అంశాన్ని కనుగొనే పనిలో పరిశోధకులు నిమగ్నమైవున్నారు. ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా సాగనుంది.
