మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (02:31 IST)

జీనియస్‌లకే జీనియస్ అశ్విన్: వాటే మ్యాచ్‌, వాటే సీరీస్‌: భారత్‌ జట్టుపై ప్రశంసల వర్షం

ఇక అసాధ్యం అనుకున్న మ్యాచ్‌ను అనితరసాధ్యమైన రీతిలో ఒడిసిపట్టుకుని ఆసీస్ జట్టును వణికించిన భారత క్రికెట్ జట్టును క్రికెట్ ప్రపంచం వేనోళ్ల పొగడుతోంది. బెంగళూరులో రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సిన

ఇక అసాధ్యం అనుకున్న మ్యాచ్‌ను అనితరసాధ్యమైన రీతిలో ఒడిసిపట్టుకుని ఆసీస్ జట్టును వణికించిన భారత క్రికెట్ జట్టును క్రికెట్ ప్రపంచం వేనోళ్ల పొగడుతోంది. బెంగళూరులో రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్‌లతో ప్రశంసలు కురిపించారు. 
 
ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్‌ జీనియస్‌ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్‌ గొప్ప విజయం సాధించిందని, జట్టుకు క్లార్క్‌ అభినందనలు తెలిపారు. భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్‌లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్‌, వాటే సీరీస్‌ అని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
 
శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగాక్కర గ్రేట్‌ ఫైట్‌ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్‌ చేశారు. భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.  బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రియల్‌ ఛాంపియన్‌లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్‌ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఆసీస్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.