శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (14:10 IST)

మహాశివరాత్రి రోజున అభిషేకాలు చేయిస్తే..?

పరమ శివుడు మహాశివరాత్రి నాడే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. పరమ పవిత్రమైన శివరాత్రి నాడు శివ పూజ చేస్తే ఈతిబాధలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

అందుచేత శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివనామస్మరణలో నిమగ్నమయ్యే వారికి పరమశివుడు తప్పక కరుణిస్తాడని విశ్వాసం. శివరాత్రి రోజు ఉపవాసం, రాత్రిపూట జాగారం చేస్తే మరింత పూజాఫలం దక్కుతుంది.
 
ఇక శివ పూజా విధానాన్ని గమనిస్తే, ఆయనకు అభిషేకాలు, బిల్వ పత్రాలు, భస్మం (విభూది) అంటే అమిత ఇష్టం. శివలింగానికి నీరు, పాలు, తేనె, నెయ్యి, పెరుగు తదితరాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వ పత్రాలు, విభూదితో అలంకరించి, ధూప దీపారాధన, నైవేద్యం పెడితే చాలు, కష్టాల్లో శివుడి అండ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.