శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ivr
Last Modified: శనివారం, 29 అక్టోబరు 2016 (20:37 IST)

వేప, పసుపు కలిపి చిన్నచిన్న గోళీలుగా చేసి తింటుంటే...

చిన్న గోళీల పరిమాణంలో ఉండలుగా తయారు చేసిన వేప, పసుపు ముద్దలను రోజూ తినాలి. ఇలా చేయటం శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్యను ఒక నిర్దిష్ట శాతంలో ఉంచుతుంది. అందువల్ల అవి వ్యవస్థకి వ్యతిరేకంగా గుమిగూడవు. శరీరంలో జడత్వం స్థాయి పెరిగితే, అది కణాలలోకి కొంత శక్తి

చిన్న గోళీల పరిమాణంలో ఉండలుగా తయారు చేసిన వేప, పసుపు ముద్దలను రోజూ తినాలి. ఇలా చేయటం శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్యను ఒక నిర్దిష్ట శాతంలో ఉంచుతుంది. అందువల్ల అవి వ్యవస్థకి వ్యతిరేకంగా గుమిగూడవు. శరీరంలో జడత్వం స్థాయి పెరిగితే, అది కణాలలోకి కొంత శక్తిని అనుమతించదు. శక్తి స్వేచ్ఛగా ప్రవహించని శరీర భాగాలు క్యాన్సర్‌కు గురవుతాయి. వేప, పసుపు కలిసి కణాలను వ్యాకోచింప చేసి, తద్వారా వాటిలోకి శక్తి ప్రసరణను మెరుగు చేసే పరికరాలుగా పనిచేస్తాయి.
 
ఉదాహరణకు, మీ కంటి వైద్యులు మీ కళ్ళలోకి చూడాలనుకుంటే, ఊరికే అలా చూడటం ద్వారా ఎక్కువ తెలుసుకోలేరు. అదే కనుపాపను వెడల్పు చేసే మందు చుక్కలు వేస్తే, మీ కనుపాప పెద్దదవుతుంది, అప్పుడు అతను లోపలికి చూడగలడు. వేప, పసుపులు శరీరంలోని ప్రతి మూలలోకి శక్తి ప్రవేశించేలా, ప్రతి మూలా దానితో నింపబడేలా శరీరాన్ని వ్యాకోచింప జేస్తాయి. ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి చికిత్స కాకపోవచ్చు, కానీ సాంప్రదాయకంగా మీరు రోజూ వేప, పసుపు తింటే, శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా అదుపులో ఉంచవచ్చని చెపుతారు.