గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (17:05 IST)

ఇరుగ్గా ఉండే ఇంటిని విశాలంగా ఉంచుకోవాలంటే..?

ఇళ్లు ఇరుకుగా ఉందా..? విశాలంగా ఉంచుకోవాలంటే.. అనవసరమైన సామాన్లు తొలగించాలి. చిన్న గదుల్లో ఎక్కువ సామానుంటే ఇరుకు ఎక్కువవుతుంది. కాబట్టి ఇల్లంతా కలియతిరిగి ఉపయోగం లేని వస్తువులను తొలగించాలి. ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులకే గదుల్లో స్థానం కల్పించాలి. అవసరమైతే తప్ప కొత్తగా వస్తువులను కొనకూడదు. 
 
వెడల్పు తక్కువగా ఉన్న గదులను నిలువుగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలి. వెడల్పుగా ఉండే ఫర్నిచర్ బదులుగా నిలువుగా, పొడవుగా ఉండే సామాన్లకు గదుల్లో స్థానం కల్పించాలి. బెడ్‌రూమ్‌లో ఒకదానిపై ఒకటుండే బంక్ బెడ్స్, కిచెన్‌లో నిలువెత్తు బాటిల్ హోల్డర్స్ ఉపయోగించండి. 
 
అయితే పెద్ద పెద్ద డిజైన్లు గల కుషన్లు, కర్టన్స్ వల్ల గదులు మరింత ఇరుకుగా కనిపిస్తాయి. కాబట్టి లేత రంగువే ఎంచుకోవాలి. పనికిరాని ఫర్నిచర్ తొలగించాలి. వస్తువు కొనేముందు దాని అవసరం ఉపయోగాలను ఆలోచించాలి. పెద్ద పెద్ద పెయింటింగ్‌లు ఫోటో గ్రాఫ్‌లు గదులను మరింత ఇరుకుగా కనిపించేలా చేస్తాయి.