శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (12:57 IST)

పెళ్లయితే అది కుదరదు.. హిట్ అయితే అందరినీ కలుస్తా.. ఫెయిల్ ఐతే?: రామ్

బ్యాక్‌బోన్‌ వల్ల ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు రామ్‌. స్రవంతి రవికిశోర్‌ తమ్ముడు కొడుకైన ఆయన.. వచ్చీరావడంతోనే ఎనర్జీలెవల్‌ ఎక్కువ వున్న నటుడిగా పేరుపొందాడు. అయితే తక్కువ ఏజ్‌లోనే హీరోగా అవ్వడంతో దేవదాస్‌ అంతటి సక్సెస్‌ మళ్ళీరాకపోవడంతో డిప్రెషన్‌కు గురయినట్లు చెబుతున్నాడు. జగడం చిత్ర కథను ఎంతగానో ప్రేమించి చేశాను. కానీ అది ఫెయిల్‌ అయింది. దీంతో రెండు నెలలపాటు ఇంటిలోంచి బయటకు రాలేకపోయానని అంటున్న రామ్‌... లేటెస్ట్‌గా... శివమ్‌తో ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.. 
 
ప్రశ్న: శివమ్‌ అంటే ఏమిటి? 
జ : పేరు శివ. తను ఎలా శివమ్‌గా మారాడన్నది కథ. తనకు నచ్చితే ఏదైనా చేస్తాడు. ఎవరిదీ వినేరకం కాదు. ఒక్కోసారి అగ్రెసివ్‌గా వుంటాడు. మరోసారి కూల్‌గా వుంటాడు. ఇలా భిన్నమైన షేడ్స్‌లో కన్పించే పాత్ర నాది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. 
 
ప్రశ్న: మీకంటే రాశీకన్నా లావు అని అనిపించలేదా? 
జ : నాఫ్రెండ్సే చెప్పారు. ఆమె ఎలా వుంటుందో అని అనుమానపడ్డాను. అయితే పండుగచేస్కో చిత్రానికి 9 కేజీలు తగ్గాను. ఆ తర్వాత ఈ సినిమాకు కవర్‌ చేశాను. దాంతో ఆమె నా పక్కన సరిపోయింది. నటనలో పోటీపడి నటించింది. తెలుగో మంచి భవిష్యత్‌ వుంది. 
 
ప్రశ్న: శివమ్‌లో కంటెంట్‌ ఏమిటి? 
జ : చెప్పాలంటే... పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. పెండ్లి ఒక్కటే మన చేతుల్లో వుంది. దేవదాసు, లైలామజ్ఞులు ఏ ప్రేమకథలు ఏవైనా విషాదాంతాలే. నేను ఆలస్యంగా పుట్టడంతో వారి ఫేట్‌ అలా తయారయింది. అనుకునే పాత్రనుంచే వచ్చిన కథే శివమ్‌. 
 
ప్రశ్న: జీవితంలో ఆనందపడిన సందర్భం? 
జ : దేవదాస్‌ హిట్‌ కావడం. జీవితంలో మర్చిపోలేని సినిమా అది. ఇక అతిగా బాధపడింది.. రెండో సినిమా జగడం.. ప్లాప్‌ కావడంతో డిప్రెషన్‌లో రెండు నెలలుపాటు వుండిపోయా. పెద్దనాన్న, నాన్న పెద్ద నన్ను డైవర్ట్‌ చేశారు. 
 
ప్రశ్న:  ఒకేసారి మూడు చిత్రాలు చేస్తున్నారే? 
జ : కష్టంగా వున్నా.. అలా కలిసి వచ్చాయి. పండుగచేస్కో గత ఏడాది రిలీజ్‌ కావాల్సివుంది. కానీ పరిశ్రమ సమ్మెవల్ల వాయిదా పడడంతో షూటింగ్‌ ఈ ఏడాది చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శివమ్‌, హరికథ చిత్రాలు వరుసగా చేస్తున్నాను. ఇప్పటికి హరికథ యాభైశాతం పూర్తయింది. 
 
ప్రశ్న: పెద్దనాన్న బేనర్‌లోనే చేస్తారా? 
జ : అలా ఏమీలేదు. దర్శకుడు కథ చెప్పి.. నిర్మాతను తీసుకువస్తే వారితోకూడా చేస్తాను. హోం బ్యానర్‌ అయితే కాస్త కంఫర్టబుల్‌గా వుంటుంది. పైగా 30ఏళ్ళ బేనర్‌ ఇది. మంచి చిత్రాలు పెద్దనాన్నగారు తీశారు. 
 
ప్రశ్న: ప్రయోగాలు చేయరా? 
జ : 'జగడం' ప్రయోగాత్మకం.. తీసి దెబ్బతిన్నాం. రెడీ సినిమా అప్పట్లో ట్రెండ్‌. 'మస్కా' కొత్త ప్రయోగం. 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం కూడా అలాంటిదే. 'కందిరీగ' కమర్షియల్‌ సినిమా. 'ఒంగోలు గిత్త' కొత్త ప్రయోగం.. ఇలా భిన్నమైన చిత్రాలు చేస్తూనే వున్నాను. కానీ ఆడని సినిమాలు గుర్తుండవు. 
 
ప్రశ్న: రియల్‌లైఫ్‌లో బైక్‌లో ఎవరికైనా లిఫ్ట్‌ ఇచ్చారా? 
జ : (నవ్వుతూ) నా బైక్‌ను చూసి నన్ను ఎవ్వరూ అడగలేదు. ఇంట్లోనే పెండ్లి ఎప్పుడూ అంటూ గొడవ చేస్తున్నారు. ఇప్పడే కాదని చెప్పాను. షూటింగ్‌కు డబ్బింగ్‌ చెప్పాలంటే రాత్ర్రుళ్లు వెళ్లాల్సి వుంటుంది. పెళ్లయితే అది కుదరదు. 
 
ప్రశ్న: యువ హీరోలతో ఎలా వుంటారు?
జ : ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. కానీ బెస్ట్‌ఫ్రెండ్స్‌ అనేవారు ఎవ్వరూలేరు. చిన్ననాటి స్నేహితులే ఎక్కువగా టచ్‌లో వుంటారు. ఏదైనా హిట్‌ సినిమా వచ్చిందా. అందరినీ కలుస్తాను. ఫెయిల్‌ అయితే ఇబ్బందిగా ఫీలవుతా. సహజంగా సినిమా తర్వాత సక్సెస్‌ టూర్‌ వేస్తారు. ఈ సినిమాకు ముందే హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌ టూర్‌ వేసివచ్చాం. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 
 
ప్రశ్న: ఇంకా ఏ రేంజ్‌కు వెళ్ళాలనిపిస్తుంది? 
జ : రజనీకాంత్‌ రేంజ్‌కు వెళ్ళినా.. ఇంకా ఆ పై రేంజ్‌కు చేరుకోవాలని వుంటుంది. సినిమా ఇండస్ట్రీ చిత్రంగా అనిపిస్తుంది. ఒకసారి సక్సెస్‌ అయితే చాలామంది ఫోన్లు చేస్తారు. ఫెయిల్‌ అయితే.. నాకే మొహం చెల్లదు. అటునుంచి కూడా అలాంటి రెస్సాన్సే వుంటుంది. అందుకే నేను నా చిన్ననాటి స్నేహితులతో తప్పిదే ఇండస్ట్రీలో ఎవరితో పెద్దగా రాపో పెంచుకోను అన్నారు.