శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (11:47 IST)

సహజీవనం తప్పులేదు.. నేను త్రివిక్రమ్ ఫ్యాన్‌ని!: నిత్యమీనన్‌

''సహజీవం అనేది ప్రపంచంలో తప్పని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరికీ స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తి వుంది. కాలానికి అనుగుణంగా సమాజం మారుతుంది. 30ఏళ్ళకింద అనుబంధాఉల ఇప్పుడు లేవు. అప్పట్లో పరిచయం లేకుండానే పెండ్లి జరిగేది. ఇష్టంలేకపోయినా జీవితం పంచుకునేవారు. ఇప్పడు అలాకాదు. మార్పు వచ్చింది. తను నచ్చినవాడితో జీవించడంలో ఎలాంటి తప్పులేదని'' నిత్యమీన్‌ తేల్చిచెప్పింది. 
 
'అలా మొదలైంది'తోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నిత్యా మీనన్‌. ఆమె చేసే సినిమాలన్నీ బాక్స్‌ ఆఫీసు వద్ద హిట్‌ అవుతుంటాయి కూడా.. టెస్ట్‌ గా నిత్యా మీనన్‌ నటించిన ఓకే బంగారం సినిమా గత శుక్రవారం రిలీజ్‌ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా సన్నాఫ్‌ సత్యమూర్తి, తమిళ్‌ లో రిలీజ్‌ అయిన 'కాంచన 2' కూడా రిలీజ్‌ అయ్యి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిత్యా మీనన్‌ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ... 
 
ప్రశ్న:  తమిళంలో 2 సినిమాలు విడుదలకావడం ఎలా వుంది? 
జ : ఒకే టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్‌ అయ్యి మంచి హిట్‌ అయ్యాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మూడు సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ప్రతి సినిమాలో డిఫరెంట్‌ రోల్‌ చేసాను. 
 
ప్రశ్న : 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో గొప్పపాత్రకాదు. నటించడానికి కారణం? 
జ : నేను త్రివిక్రమ్‌ ఫ్యాన్‌ను. ఆయన అత్తారింటికి దారేది సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన కమర్షియల్‌ స్పేస్‌‌లో చాలా ఇంటెలిజెంట్‌‌గా సినిమా చేస్తారు. కమర్షియల్‌ తో పాటు మంచి కంటెంట్‌ కూడా ఉంటుంది. కమర్షియల్‌ సినిమా ఎలా ఉంటుందనేది ట్రై చెయ్యడానికి ఈ సినిమా చేసాను. 
 
ప్రశ్న : మీరు గోల్డెన్‌లెగ్‌ అనే కామెంట్‌ వుంది. దానికి. మీరెలా స్పందిస్తారు? 
జ : అలా ఏమీ లేదు. సక్సెస్‌ నా ఒక్కదానిదేకాదు. అందరి కృషి. 
 
ప్రశ్న : ఇదివరకంటే సినిమాలు పెంచారే.. కారణం? 
జ : ప్రత్యేకంగా ఏమీ లేదు.. గత సంవత్సరం ఒక సినిమా కూడా లేదు. నా వర్క్‌ మాత్రం లాస్ట్‌ ఇయర్‌ మొదలు పెట్టాను, ఆ వర్క్‌ ఈ ఏడాది వరుసగా వస్తున్నాయి అంతే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కాంచన 2 సినిమాల షూటింగ్‌ గత ఏడాది జరిగింది. సత్యమూర్తి, ఓకే బంగారం ఈ ఏడాది షూట్‌ చేసాం కానీ అన్నీ ఒకేసారి రిలీజ్‌ అవుతున్నాయి. అంతే కానీ ఎక్కువ సినిమాలు చేసెయ్యాలనిఏమీ కాదు. 
 
ప్రశ్న : మణిరత్నం నుంచి ఏం నేర్చుకున్నారు? 
జ : నటన మెరుగుపడేలా ఎంతోకొంత ప్రతి సినిమా నుంచి నేను నేర్చుకుంటాను. ఒక్క మణిరత్నం గారి నుంచే నేర్చుకున్నాను అని చెప్పలేను. ఎందుకంటే ఎంతో మంది కొత్త వారి నుంచి కూడా చాలా నేర్చుకుంటాను. అలాగే మణిరత్నం గారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. 
 
ప్రశ్న: ఇటీవల హీరోయిన్స్‌ ప్రాధాన్యత తగ్గుతుంది.. కారణం ఏమంటారు? 
జ : అది బాధాకరమైన విషయం కానీ ఇప్పుడదే కదా ట్రెండ్‌.. సినిమాలలో సెన్సిబిలిటీ ఉండాలి. హౌస్‌ వైఫ్‌ పాత్రని చూపించినా రియల్‌‌గా, సెన్సిబిలిటీస్‌ ఉండేలా చూపిస్తే బాగుంటుంది. 
 
ప్రశ్న: బెంగుళూరు డేస్‌ రీమేక్‌‌లో నటించడానికి గల రీజన్‌ ఏమిటి.? 
జ : నిజం చెప్పాలంటే అంజలి మీనన్‌ ఆ కథ రాసింది నాకోసమే.. కానీ అప్పుడు చేసే టైం లేక మెయిన్‌ లీడ్‌ అయిన నజరియా పాత్ర కాకుండా వేరే రోల్‌ చేసాను. ఇప్పుడు అదే అవకాశం తమిళ్‌‌లో వచ్చింది. అది నా కథ కదా అందుకే చేస్తున్నాను. 
 
ప్రశ్న : సమంత ది బెస్ట్‌ హీరోయిన్‌ అంటుంది. దానిపై మీ కామెంట్‌.? 
జ : నా కెరీర్‌ మొదటి నుంచే సమంత నన్ను పొగుడుతూ ఉంటుంది. నా యాక్టింగ్‌, నా వర్క్‌ అంటే తనకి ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా ఓకే బంగారం చూసి అన్‌ బిలీవబుల్‌ అని మెసేజ్‌ చేసింది. సత్యమూర్తి టైంలో ఇద్దరం కలిసి పనిచేశాం.. ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాం. యాక్టర్స్‌‌గా ప్రొఫెషనల్‌‌గా ఇద్దరికీ డిఫరెంట్‌‌గా ఉంటుంది, కానీ బయట ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న మంచి ఫ్రెండ్స్‌ మేమిద్దరం. 
 
ప్రశ్న : బాలీవుడ్‌లో చేయరా? 
జ : చెయ్యాలని ఆసక్తి లేదు, నేను ట్రై కూడా చేయలేదు. ఒకవేళ నాదారిలో ఏదన్నా మంచి స్క్రిప్ట్‌ వస్తే నాకు నచ్చితే చేస్తాను. అని ముగించారు.