గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2015 (20:15 IST)

నాగచైతన్య చాలా స్వీట్ అండ్ కూల్... ''దోచెయ్'' కృతి సనన్‌ ఇంటర్వ్యూ

మహేష్‌ బాబుతో '1' నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కృతిసనన్‌. తెలుగులో ఆయనతో నటించడం లక్‌గా ఫీలయ్యానని అంటున్న కృతి.. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. కానీ తాజాగా నాగచైతన్యతో 'దోచేయ్‌'లో జతకట్టింది. శుక్రవారంనాడు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమెతో చిట్‌చాట్‌.
 
దోచేయ్‌లో ఆకట్టుకున్న పాయింట్‌ ఏమిటి? 
దర్శకుడు వర్మ కథ చెప్పిన విధానం నచ్చింది. ఇందులో పాత్ర పేరు మీరా. మెడికల్‌ స్టూడెంట్‌. కానీ చదువు మీద ఇంట్రెస్ట్‌ ఉండదు. అబ్బాయిలా డామినేట్‌ చేయాలనుకుంటుంది. మనసులో ఏముందో నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఇవన్నీ చాలా నచ్చాయి.
 
నిజజీవితానికి దగ్గరగా వుంటుందా? 
లేదు. నేను నిజజీవితంలో చాలా సాఫ్ట్‌గానే ఉంటాను. నాకు నచ్చినట్లే చేస్తాను. ఆలోచిస్తాను.
 
'దోచేయ్‌' అంటే ఏమిటి? 
చెప్పేస్తే ట్విస్ట్‌ పోతుంది. రేపే విడుదల కాబట్టి.. మీకే తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇదొక ఫన్‌, ఎంటర్‌‌టైనింగ్‌ మూవీ. థ్రిల్లర్‌ అని చెప్పలేం కాని అలాంటి సీన్స్‌ ఉంటాయి. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. లవ్‌, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాలు అన్ని ఉంటాయి. రొటీన్‌గా అయితే ఉండదు. 
 
యాక్షన్‌ సీన్స్‌ చేశారా? 
చేయాలనున్నా కథలే అస్సలు కుదరలేదు.
 
నాగచైతన్యతో నటించడం ఎలా వుంది? 
మొదట ఆడిషన్‌కు వచ్చాను. అప్పుడే పరిచయం. ఇంచుమించు ఒకే వయస్సువాళ్ళం. తను తక్కువ మాట్లాడతాడు. చాలా స్వీట్‌, కూల్‌ పర్సన్‌. సీనియారిటీ ఏం చూపించడు. ఒకే ఏజ్‌ గ్రూప్‌ వలన వర్క్‌ చాలా కంఫర్ట్‌ అనిపించింది. చైతు స్పాంటేనియస్‌ యాక్టర్‌. 
 
డైరెక్టర్‌ గురించి..? 
సుధీర్‌ చాలా పర్ఫెక్ట్‌‌గా ఉంటాడు. తనకు ఏం కావాలో చాలా బాగా తెలుసు. క్లారిటీగా ఉంటాడు. ఎక్కువ టేక్స్‌ తీసుకోవడానికి ఇష్టపడడు. తనకొక స్పెషల్‌ వే ఉంటుంది.
 
మీపై విమర్శలు ఎలా స్వీకరిస్తారు? 
ప్రస్తుతానికి నా మీద ఎలాంటి గాసిప్స్‌ లేవు. గాసిప్స్‌ కూడా ఇండస్ట్రీలో భాగమే. ప్రతిది చాలా పాజిటివ్‌‌గా తీసుకుంటాను. ఒకరు నా గురించి చెప్పి ఏమైనా ఛేంజ్‌ అవమంటే ఖచ్చితంగా ఆలోచిస్తాను. 
 
తదుపరి చిత్రాలేమైనా? 
ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాకి సైన్‌ చేయలేదు. హిందీలో రెండు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. షారుఖాన్‌ 'దిల్వాలే' షాహిద్‌తో 'ఫర్జ్‌' వున్నాయి.
 
తెలుగు, హిందీ భాషల్లో గమనించింది ఏమిటి? 
రెండు చోట్ల షూటింగ్‌ ఒకేలా వుంటుంది. పెద్ద తేడా అనిపించలేదు. భాషపరంగా కూడా ఇబ్బంది లేదు. దోచేయ్‌కు సినిమాటోగ్రాఫర్‌ తెలుగువాడే. ఇంగ్లీషులో రాసిచ్చింది.. తెలుగులో చెప్పడం.. సీన్‌ అర్థమైతే నటన ఒకేలా వుంటుంది అని చెప్పింది కృతి.