Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అడల్ట్ సినిమాల్లో నటిస్తే ''చీప్'' అనే ముద్ర ఎందుకు వేయాలి? బాబు బాగా బిజీపై అవసరాల

గురువారం, 4 మే 2017 (15:38 IST)

Widgets Magazine

బాహుబలి-2 సినిమాతో పోటీపడేందుకు ''బాబు బాగా బిజీ'' శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇదో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా కావడంతో బాహుబలి ఫీవర్‌లోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. బాహుబలిని చూసేందుకు వచ్చే వారంతా తమ సినిమాను కూడా చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా టైటిల్ రోల్ పోషించిన శ్రీనివాస్ అవసరాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్ అయ్యానని చెప్పాడు. బాహుబలి మాత్రమే థియేటర్లలో ఉండటం.. ఇతర తెలుగు సినిమా థియేటర్లలో కనిపించకపోవడంతో బాబు బాగా బిజీ పంట పండినట్టేనని చెప్పాడు. కొన్ని సీన్లను కట్ చేయగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని తెలిపారు. 
 
ప్రేక్షకులు ముక్కుపై వేలేసుకుంటారని.. ఊహించినట్లే సెన్సార్ 'ఎ' సర్టిఫికేట్ జారీ చేసిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. సాధారణంగా సినిమాల్లో హత్యలు చేసిన వాడిని బయట కిల్లర్ అంటారా..? అలాంటిది హాట్ సీన్లలో నటించినంత మాత్రాన బయట కూడా అదే దృష్టితో ఎలా చూస్తారని ప్రశ్నించారు. హాట్ సినిమాల్లో నటించేవారిపై ''చీప్'' అనే ముద్ర ఎందుకేయాలని అవసరాల ప్రశ్నించాడు. 
 
హంటర్ సినిమాకు రీమేక్‌గా వచ్చే బాబు బాగా బిజీ సినిమాను ముందుగా చేయకూడదని అనుకున్నట్లు తెలిపారు. సెకండ్ హాఫ్ వచ్చే సరికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. ఇందులో స్నేహితుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయన్నారు. ఈ కథేంటి అని ఆలోచించుకున్నాకే డిఫరెంట్‌గా వెళ్లాలని ఈ సినిమాలు చేశానని.. మొత్తానికి తెలుగులో రానంత గ్రాండ్ పక్కా అడల్ట్ కామెడీ సినిమా ఇదని సినీ పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ అంటే ఇష్టం.. అతన్ని వదిలివుండలేనంటున్న స్వీటి.. మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారా?

స్వీటి అనుష్క తన మనసులోని మాటను వెల్లడించింది. తన పెళ్లి ప్రస్తావనపై ఎక్కడోచోట... ఏదో ఓ ...

news

త్రిష హేపీ బర్త్ డే టూ యూ... వయసు 33, పెళ్లెప్పుడంటే...

1999లో వెండితెర అరంగేట్రం చేసిన దగ్గర్నుంచి సినిమాల్లో తళుకుబెళుకులు చూపిస్తూ వస్తున్న ...

news

'బాహుబలి' థియేటర్‌లో సమంతకు చేదు అనుభవం.. సినిమా చూడకుండానే బయటకు...

త్వరలోనే అక్కినేని ఇంటికోడలు కాబోతున్న హీరోయిన్ సమంతకు అవమానం జరిగింది. అదీ కూడా 'బాహుబలి ...

news

అనాథల కోసం రూ.కోట్లు విలువ చేసే ఇంటిని దానం చేసిన హీరో ఎవరు?

పుట్టిపెరిగిన ఇల్లు! చెంగు.. చెంగుమనుకుంటూ చిన్నప్పుడు గెంతిన ఇల్లు! కాయకష్టం చేసి ...

Widgets Magazine