శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (17:25 IST)

జాయింట్ ఫ్యామిలీ కల్చర్ ఇష్టం.. 'చుట్టాలబ్బాయి' ఆలరిస్తుంది : సాయి కుమార్

ఆది, నమితా ప్రమోద్‌ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర

ఆది, నమితా ప్రమోద్‌ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, హీరో ఆది పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ ''గురువారమంటే నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైన రోజు. ఇదేరోజు ఆది, నేను కలిసి 'చుట్టాలబ్బాయి' షూటింగ్‌లో పాల్గొన్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో షూటింగ్‌ జరిపాం. ఇద్దరం ఒకే డ్రస్‌లో వాక్‌చేస్తూ ఉండే సన్నివేశాన్ని వీరభద్రమ్‌ అద్భుతంగా చిత్రీకరించాడు. అక్కడ ప్రజలు మా ఇద్దరి కాంబినేషన్‌ చాలా బాగుంది భయ్యా..! అని ప్రశంసించారు. చిన్నప్పటి నుండే నాకు అచ్చ తెలుగుదనం అంటే చాలా ఇష్టం. అందుకే పంచెకట్టులో ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ చిత్రంలో దొరబాబు అనే ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో నటించాను. పాత్రోచితంగా నా క్యారెక్టర్ ఉంటుంది. నాన్నతో మొదలైన ఈ ప్రయాణం బాల నటుడుగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పాను. 'పోలీస్‌స్టోరీ' చిత్రం నాకు బిగ్‌ బ్రేక్‌నిచ్చింది.
 
ఈ చిత్రం రిలీజై ఈనెల 16వ తేదీకి 20 యేళ్లు పూర్తయింది. పోలీస్‌ స్టోరీ చిత్రం నాకు ఎంతో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు, పటాస్‌, సరైనోడు, సుప్రీమ్‌ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించాను. నా ఫ్యాన్స్‌ అంతా ఇప్పుడు ఆది ఫ్యాన్స్‌ అయ్యారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాం. ఆడియో పెద్ద సక్సెస్‌ అయింది. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో నేను చెప్పిన డైలాగ్‌ 'తప్పు చేయడం మీ లెక్క.. సరిచేయడం నా లెక్క. లెక్క క్లియర్‌' అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. ఫస్ట్‌ నుండి నేను జాయింట్‌ ఫ్యామిలీ కల్చర్‌ని బాగా లైక్‌చేస్తాను. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్‌ అయినా అందరి సమక్షంలో కలిసే చేసుకుంటాం. అలా అందరూ కలిసుండాలి అని కోరుకునే క్యారెక్టర్‌ 'చుట్టాలబ్బాయి'ది. ఫస్ట్‌ ఈ కథ ఆది విని చాలా ఎగ్జైట్‌ అయి నాకు చెప్పాడు. నేను థ్రిల్‌గా ఫీలయ్యాను. 
 
ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన క్యారెక్టర్‌ నేను చేస్తే బాగుంటుంది అని వీరభద్రమ్‌ని అడిగాను. వెంటనే చాలా బాగుంటుంది భయ్యా అని రైటర్స్‌ భవాని, శ్యాంలతో కూర్చుని కథని బాగా డెవలప్‌చేసి వినిపించారు. ఎక్స్‌ట్రార్డినరీగా నా క్యారెక్టర్‌ వచ్చింది. ఆ క్యారెక్టర్‌లో అంత పవర్‌ ఉంటుంది. వీరభద్రమ్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా ఈ చిత్రం ఉంటుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ఇది. కమర్షియల్‌ ఇంగ్రిడియంట్స్‌ ఉన్న ఫీల్‌గుడ్‌ ఫిలిం. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్‌ నుంచి ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ ఉంది. నిర్మాతలు రామ్‌, వెంకట్‌ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కించారు. ఆది కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. బ్యాంకాక్‌లో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చిత్రీకరించారు. అది చాలా బాగా వచ్చింది. థమన్‌ ఎక్స్‌లెంట్‌ ఆడియో ఇచ్చాడు. నాన్న, నేను, ఆది కలిసి చేయాలనుకున్నాం, కుదరలేదు. 
 
ఈ చిత్రంలో నాన్న ఫొటో పెట్టి మేం ఇద్దరం కలిసి యాక్ట్‌ చేశాం. చేసేటప్పుడు చాలా థ్రిల్‌ అయ్యాను. హీరో అవ్వాలనేది నాన్న కోరిక. అది మిస్‌ అయ్యారు. నేను అనుకోకుండా యాక్టర్‌ని అయ్యాను. తెలుగు సినిమా హీరోకి కావాల్సిన క్వాలిటీస్‌ అన్నీ ఆదిలో ఉన్నాయి. సెంటిమెంట్‌గా నాన్న కోరిక ప్రకారం విజయనగరంలో ఈ సినిమా మొదటి షో చూస్తాను. అందరికీ నచ్చే సినిమా చేశామన్న ఫీలింగ్‌ ఉంది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిగ్‌ రిలీజ్‌ అవుతుంది. నా క్యారెక్టర్‌ లవబుల్‌గా, క్యూట్‌గా ఉంటుంది. నా నుంచి ఎంత కావాలో అంతా వీరభద్రమ్‌ తీసుకున్నాడు. ఓవర్‌గా ఎక్కడా ఉండదు. 'ప్రేమకావాలి' నుండి ఆది హార్డ్‌వర్క్‌ చేస్తూ ఏడు సినిమాలు కంప్లీట్‌ చేశాడు. ప్రతి సినిమాలో మెచ్యూర్డ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆది కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు.
 
 
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది మాట్లాడుతూ ''చుట్టాలబ్బాయి' చిత్రంలో రికవరీ బాబ్జీ క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేశాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఈ క్యారెక్టర్‌ ఉంటుంది. అలాంటి కుర్రాడు ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎన్నో ప్రాబ్లమ్స్‌ క్రియేట్‌ అవుతాయి. ఆ ప్రాబ్లమ్‌ నుండి ఎలా బయట పడ్డాడు అనేది కథ. ఆల్‌ కైండాఫ్‌ షేడ్స్‌ నా క్యారెక్టర్‌లో ఉంటాయి. ఇట్స్‌ ఎ ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిలిం. ఆలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, షకలక శంకర్‌ల కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. నాన్న చేసిన దొరబాబు క్యారెక్టర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా నిలుస్తుంది. లాస్ట్‌ త్రీ ఫిలింస్‌ డిజప్పాయింట్‌ చేశాయి. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 
 
చాలా మెచ్యూర్డ్‌గా ఈ చిత్రంలో చేశాను. ఒకే బేనర్‌లో కాకుండా డిఫరెంట్‌గా మంచి సినిమాలు ఎన్నుకుని సినిమాలు చేస్తాను. వీరభద్రమ్‌ నా క్యారెక్టర్‌తో పాటు డాడీ క్యారెక్టర్‌ అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ అందరూ ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. కొత్త నిర్మాతలైనా ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులైన నిర్మాతలు వెంకట్‌, రామ్‌‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు'' అన్నారు.