1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp Latest Android Beta Brings Back 30 Second-Limit for Video Status Updates

వాట్సాప్.. మళ్ళీ స్టేటస్ వీడియో నిడివి 30 సెకండ్లుగా ఫిక్స్! (video)

WhatsApp
ప్రముఖ సోషల్‌మీడియా మేస్సేజింగ్‌ యాప్‌ సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో వాట్సాప్ ద్వారా అనేక తప్పుడు వార్తలు షేర్ అవుతున్న నేపథ్యంలో యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. 
 
తాజాగా మళ్ళీ స్టేటస్ వీడియో నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు అందుబాటులో వుంటాయి. 
 
ఇకపోతే.. వాట్సాప్ మొదలైనప్పుడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకన్లు వుండేవి. యూజర్లు పెరుగుతున్నా కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తోంది. భారత్‌లో వాట్సాప్‌ యూజర్లు 40 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. యూజర్లు పెరిగే కొద్దీ కొత్త ఫీచర్లను వారికి అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. 
 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా మిగిలి చోట్ల... కండిషన్స్ అప్లై