సంబంధిత వార్తలు
- #VivoV15Pro ట్రిపుల్ రియర్ కెమెరా.. సెల్ఫీ లవర్స్‌కు ట్రీట్
- కేంద్రం మొండిచేయి చూపినా... వైజాగ్ మెట్రో రైల్ రాబోతోంది...
- సీమ రోడ్లపైకి మేడిన్ ఆంధ్రా కారు : టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు
- అత్యాధునిక హంగులతో జనసేన ప్రచార రథాలు.. పవన్ వేగం...
- భారత నేవీ మొదటి కస్టమర్... ఒకినావా ఐ-ప్రైయిజ్ “ది ఇంటెలిజెంట్ స్కూటర్”
ఈ కెమేరాతో చిమ్మచీకట్లోనూ వీడియో తీయొచ్చు... వివరాలేంటి?
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్‌లో వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖంగా మొబైల్ రంగంలో అరంగ్రేటం చేసి అనతికాలంలోనే అగ్రగామి స్థాయికి చేరింది. మొబైళ్లు, పురుషుల షూలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, స్మార్ట్‌వాచీలు మొదలైన వాటిని ఇప్పటికే షియోమీ బ్రాండ్ తీసుకొచ్చింది.
వాటితో పాటుగా ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080పి నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అందులోని ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌తో 10 మీటర్ల దూరంలో చీకటిలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది.
ఈ కెమెరా 130 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధరను రూ.2,699గా నిర్ణయించారు. ఈ కెమెరా రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
