గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2014 (18:30 IST)

పారెంట్స్ తప్పు చేసినా.. పిల్లల ముందు సారీ చెప్పేయండి..!

తప్పు ఎవరు చేసినా తప్పే. అందుచేత ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు క్షమాపణ అడగడానికి ఆలోచించకండి. తప్పుని ఒప్పుకుని క్షమాపణ చెబితే అందరికీ మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లలకు పారెంట్స్‌పై గౌరవభావం పెరుగుతుంది. 
 
క్షమాపణ చెప్పని మొండి వారిగా ఉండడం కంటే, తప్పు చేయడం సహజమని, చేసిన తప్పు సరిదిద్దుకుని క్షమాపణ అడగడేందుకు గల విలువని పిల్లలకి వివరించండి. ప్రశాంతంగా సందర్భాన్ని విశ్లేషించి, తప్పు ఎక్కడ చేసారో ఎందుకు చేసారో ఆలోచించుకోండి. ఆ తరువాత అలా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో తెలుసుకోండి. 
 
క్షమాపణ అడగడానికి "నా ప్రవర్తనకి నేను క్షమాపణ అడగదలుచుకున్నాను. అది తప్పని ఇప్పుడు అర్ధం అయ్యింది" అని అసలు విషయం తెలియచేయండని అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. 
 
అలాగే పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడండి. అర్ధం చేసుకోవడానికి, చక్కగా వినడానికి ప్రయత్నించండి. అమ్మ దగ్గర లభించే సలహా, యుక్తవయసు పిల్లలకి అవసరమైన సూచనలు, స్నేహం, హోంవర్క్‌లో సహాయం, లేదా మృదువైన కౌగిలి ఇవన్నీ పిల్లలకి ధైర్యాన్ని కలిగిస్తాయి. వారితో ఎవరూ మాట్లాడకపోతే వారు కొంచెం బోర్‌గా ఫీల్ అవుతారు. కాబట్టి, వారితో వీలైనప్పుడల్లా మాట్లాడండని వారు సూచిస్తున్నారు.