మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:41 IST)

పిల్లలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారు?: ఇవిగోండి టిప్స్

పిల్లలకు పెట్టే ఆహారంలో  మంచి కొలెస్ట్రాల్, ప్రోటీన్స్, కార్బొహైడ్రేడ్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. కొవ్వు పదార్థాలతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు శరీరంలోని మూత్రపిండాలు, గుండెకు రక్షణ కవచాల్లో ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకునే వారు వాతావరణ మార్పుల్ని తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.
 
అలాగే మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగుల్ని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారే సరికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. విద్యార్థుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. 
 
గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి. 
 
మినరల్‌ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, ఖర్జూరా, బాదం పిల్లలకు తినిపించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.