శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (16:26 IST)

పనిచేయించుకోవడం కోసం పిల్లలకు డబ్బిస్తున్నారా?

కొందరు తల్లిదండ్రులు పిల్లల వద్ద పనిచేయించుకునేందుకు డబ్బులిస్తానంటారు. క్రమశిక్షణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడం వల్ల వారు దానికి అలవాటు పడే అవకాశం ఉంది. 
 
చిన్నారులకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇవ్వకుండా నెలకోసారి మాత్రమే ఇవ్వండి. దాన్ని నెల మొత్తం జాగ్రత్తగా వాడుకోమని చెప్పండి. మీరిచ్చే డబుల్ని మీ పిల్లలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఖర్చు పెడతారు. 
 
కొందరు నెల తరబడి దాచుకుంటే.. మరికొందరు ఒకట్రెండు రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. మరికొందరికి అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టే గుణం ఉంటుంది. 
 
అందుచేత పిల్లలకు డబ్బు విలువను పారెంట్స్ తెలియజేయాలి. డబ్బులు లేకుంటే తలెత్తే ఇబ్బందులను నేర్పాలి. హెచ్చరిస్తున్నట్లుగా కాకుండా అనునయంగా చెప్పాలి. వారినే చిన్న చిన్న షాపులకు పంపడం.. వస్తువులను కొనుక్కొని రమ్మనడం చేయాలి. 
 
ఇలా చేస్తే మనీ మేనేజిమెంట్ పిల్లలకు అలవాటవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.