శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (18:42 IST)

వర్షాకాలంలో స్కూల్ షూస్ విషయంలో జాగ్రత్త!

వర్షాకాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. వర్షపు జల్లుల ప్రభావంతో తోలు వస్తువుల మీద ఫంగస్ చేరుతుంది. తోలుతో తయారైన హ్యాండ్ బ్యాగ్‌లను తేమ చేరని ప్రదేశంలో పెట్టండి.

అదేవిధంగా పిల్లల స్కూల్ షూస్‌లో తేమ చేరకుండా చూడాలి. లేకుంటే స్కూల్ షూస్‌లో చేరిన ఫంగస్ పిల్లల పాదాలను చేరి రాషెస్‌కు దారితీస్తుంది. అటువంటి షూస్‌తో పాత పేపరు పెడితే తేమను అవి పీల్చుకుంటాయి. పైగా షూస్ రూపం చెడకుండా ఉంటుంది.
 
ఒకవేళ పిల్లలు వర్షంలో తడిసి వచ్చినప్పుడు వెంటనే వారి షూస్ తొలగించి ఆ తడిపోయేలా వాటిని గోడకు ఆనించి ఏటవాలుగా పెట్టండి. పిల్లలకు తేమతో ఉన్న సాక్స్‌ను తొడగవద్దు. ప్రతిరోజూ శుభ్రంగా ఉన్న షూస్, సాక్స్‌ని తొడిగి స్కూల్‌కి పంపండి.