శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:22 IST)

పిల్లలకు జబ్బులొస్తున్నాయంటే.. ఆ తప్పు పెద్దలదే!

పిల్లలకు జబ్బులొస్తున్నాయంటే.. ఆ తప్పు పెద్దలదే అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. కంటి చూపు మందగించడం, 20 సంవత్సరాల్లోనే జుట్టు తెల్లబడిపోవడం, చీటికి మాటికి జ్వరాలు, రొంపలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం పోషకాహార లోపంతోనే వస్తున్నాయి. అలాంటప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే.. ప్రతిరోజూ ఉదయం పచ్చికూరల రసాన్ని (క్యారెట్ ఎక్కువగా చేర్చి) ఒక గ్లాసుడు ఇవ్వండి. దానివల్ల కంటిచూపు మెరుగవుతుంది. 
 
అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన వేరుశెనగ పప్పులు, పది ఖర్జూరం, పచ్చికొబ్బరి పెట్టండి. ఒకవేళ కొబ్బరి తినకపోతే.. దానికి బదులు కొన్ని నీళ్ళు పోసి గ్రైండర్‌లో వేసి, దానిని వడకట్టి ఒక కప్పుడు పాలను తేనెతో కలిపి ఇవ్వండి. కొబ్బరిపాలు మామూలు పాలకంటే చాలా శ్రేష్ఠం. ఈ టిఫిన్ మీ పిల్లలకు పెడితే ఎంతో బలం. 
 
ఎదుగుదల, ఆరోగ్యం అన్నీ వస్తాయి. కండపుష్ఠి పెరుగుతుంది. సాయం కాలం స్కూల్ నుంచి వచ్చాక.. పండ్లు లేకపోతే ఒక గ్లాసుడు పండ్లరసం ఇవ్వండి. ఆదివారం రోజున నాలుక కోరినవి పెట్టండి. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం శరీరం కోరేవి ఆరోగ్యాన్నిచ్చేవి మాత్రమే పెట్టండి.