గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (16:35 IST)

పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ పెడుతున్నారా?

స్కూల్స్ వెళ్లే పిల్లలకు రంగు రంగుల ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం పెట్టి పంపుతున్నారా? అయితే జాగ్రత్త పడండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు ఇచ్చి పంపిస్తుంటే ఈ కథనం చదవాల్సిందే. టపర్ వేర్ వంటి హై క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లల ఆహారం ఇచ్చి పంపించవచ్చు. 
 
అంతేకానీ తక్కువ ధరలకు అమ్మే నాణ్యత లోపం గల ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారం ఇచ్చి పంపడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వేడికి మెల్ట్ కావడంతో పాటు రంగు కూడా ఆహారంలో కరిగి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుచేత ప్లాస్టిక్ డబ్బాల ఎంపికలో పారెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.