గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2014 (16:03 IST)

పిల్లలకు డబ్బును ఆదా చేయాలని నేర్పించడం ఎలా?

పిల్లలకు పొదుపు అలవాట్లను నేర్పటం చాలా మంచిది. దీనివలన భవిష్యత్తును ముందుగానే చూడగలుగుతారు. అందుచేత చిన్న వయస్సు నుంచే పిల్లల్లో డబ్బు ఆదాను నేర్పించండి. ఇందులో భాగంగా పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వండి. పిగ్గీ బ్యాంకులు, ఈ డిజిటల్ యుగంలో పాతమాటగా అనిపించినా.. ఇప్పటికీ ఆదా చేసే విషయాన్ని ఇవి పిల్లలకు బాగానే నేర్పుతాయి. 
 
డబ్బు ఆదా చేయటంవలన వారు కోరుకున్నది ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చునని పిల్లలకు తెలుస్తుంది. పిల్లలికి ప్రతి నెలా స్థిరంగా కొంత డబ్బును ఇవ్వటం ప్రారంభించండి. వారు దీనిలో ఎలా ఆదా చేస్తున్నారో గమనించండి. వారికి ఆదా చేయటం ఎలానో నేర్పించండి. తరువాత, వారి పాకెట్ మనీ నుండి ఆదా చేయమని చెప్పండి.
 
డబ్బు ఆదా చేసే విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు రోల్ మోడల్‌గా ఉండండి. "మీ పిల్లలకు ఆదా ఎలా చేయాలి అని బోధించేటప్పుడు కథలరూపంలో చెప్పటం ఉపయోగకరంగా ఉంటుంది. పొదుపుకు సంబంధించిన కథలను ఎంచుకుని వాటిని ఉదహరించండి. 
 
ఒకవేళ టీనేజ్ పిల్లలైతే.. వారిని బ్యాంకులో ఒక పొదుపు ఖాతాను తెరవమని చెప్పండి. అంతేగాకుండా ఆదా చేసిన డబ్బును సద్వినియోగం చేసుకోవడంలోనూ మెళకువలను నేర్పండి. ఇంకా దాచిన డబ్బును పిల్లలు అనవసరపు ఖర్చులు చేయకుండా చూడండి.