గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 జులై 2016 (12:19 IST)

పిల్లలు బరువు పెరగాలా.. మటన్ సూప్ ఇవ్వండి.. జంక్ ఫుడ్ వద్దే వద్దు..!

మీ పిల్లలు ఎప్పటికీ బక్కపలచగా కనిపిస్తున్నారా? కాస్తైనా బొద్దుగా కనిపించట్లేదా? పిల్లలు బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలని తలపట్టుకుని కూర్చున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. మీ పిల్లలకి ఇచ్చే భోజనంల

మీ పిల్లలు ఎప్పటికీ బక్కపలచగా కనిపిస్తున్నారా? కాస్తైనా బొద్దుగా కనిపించట్లేదా? పిల్లలు బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలని తలపట్టుకుని కూర్చున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. మీ పిల్లలకి ఇచ్చే భోజనంలో ఎక్కువ క్యాలోరీల గల మీట్‌ను ఇవ్వండి. మటన్ సూప్ ఇవ్వండి. తద్వారా వారి శరీరానికి కావలసిన ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్ లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్న పిల్లలో ఎక్కువ క్యాలోరీల ఆహారాన్ని అందించటం చాలా మంచిది. ఇంకా పిల్లలు బరువు పెరగాలనుకుంటే.. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంచండి.
 
భోజనానికి ముందు ఎక్కువ ద్రావాలు తీసుకోవటాన్ని ఆపండి. ఎందుకంటే ద్రావాల వలన పిల్లలు సరిగా తినకపోయినా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ క్యాలోరీస్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ కొద్దిసేపు ఆడుకోవడం ద్వారా పిల్లలు మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందుతారు.  
 
ఇంకా పిల్లలు బరువు పెరగాలనుకునే తల్లిదండ్రులు వంటల్లో ఆలివ్ నూనెను వాడాలి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ శక్తిని ఇవ్వటమే కాకుండా, గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటేడ్ ఫాట్, యాంటీ-ఆక్సిడెంట్స్‌ని అందిస్తుంది.