శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 9 జులై 2014 (16:44 IST)

రంజాన్ స్పెషల్: మటన్ డ్రమ్ స్ట్రిక్స్ దాల్చా!

మటన్ డ్రమ్ స్ట్రిక్స్ దాల్చా హైదరాబాద్ స్పెషల్. ఈ మటన్ దాల్చాన రంజాన్ నెలలో విరివిగా తయారుచేసుకుంటారు. మటన్-మునకాయల కాంబినేషన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్. ఇందులో వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించడంలో మంచి సువాసనతో పాటు, రుచిగా నోరూరిస్తుంటుంది. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మసూర్ దాల్: అరకప్పు 
శెనగపప్పు:  పావు కప్పు 
ఆవాలు: ఒక టీ స్పూన్ 
లవంగాలు: ఐదు
పుదీనా తురుము: 2 టేబుల్ స్పూన్లు 
మామిడికాయపొడి: 2 టేబుల్ స్పూన్లు 
కారం: 1 టేబుల్ స్పూన్ 
పసుపు: 1 టేబుల్ స్పూన్ 
నెయ్యి: 50 గ్రాములు 
ఉప్పు, నూనె తగినంత 
దాల్చిన చెక్క : మూడు 
వెల్లుల్లిపాయ తరుగు : అరకప్పు 
మటన్: ఒక కేజీ 
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్ 
కరివేపాకు : కాసింత 
ఎండు మిర్చి : 10
మునగకాయలు: 2
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కల్ని రెండు విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి. కందిపప్పును గంటపాటు నానబెట్టాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అందులో అల్లంవెల్లుల్లి, మటన్ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. 
 
పచ్చివాసన పోయే వరకూ వేగిన తర్వాత అందులో మటన్ ఉడికించిన నీరు పోసి మటన్ ముక్కలు పూర్తిగా ఉడికే వరకూ ఉంచాలి. మరో పాన్‌లో నూనె వేసి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగాక ఉడికించిన మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపి దింపుకోవాలి. చివరగా మామిడికయ పొడి, మిగిలిన నెయ్యి, పుదీనా తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే మటన్ డ్రమ్ స్టిక్ దాల్చా రెడీ.