శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (05:40 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 03-09-17

మేషం : ఈ రోజు విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ

మేషం : ఈ రోజు విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలకు సంబంధించి మెలకువ వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృషభం : ఈ రోజు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం : ఈ రోజు వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు వాయిదా పడటం లేక జాప్యం వంటి చికాకులు తప్పవు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం : ఈ రోజు ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలను మంచిదికాదు అని గమనించండి. మీ విషయంలో బంధువులు, ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. 
 
సింహం : ఈ రోజు ప్రతి విషయంలోనూ నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసి రాగలదు. ధనం, విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనకరం ఉంటాయి. ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబీకులు మీ మాటను, తీరును వ్యతిరేకిస్తారు. 
 
కన్య : ఈ రోజు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. సహోద్యోగులతో కలిసి సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. స్త్రీలు, ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడక తప్పదు. 
 
తుల : ఈ రోజు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు లాభదాయకం. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. 
 
వృశ్చికం : ఈ రోజు వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఖర్చులు అధికం. 
 
ధనస్సు : ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించినందుకు కించిత్ ప్రశ్చాత్తాపం చెందుతారు. 
 
మకరం : ఈ రోజు ఆహ్వానం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం చికాకులు ఎదుర్కొంటారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుంచి గుర్తింపు, మన్ననలు లభిస్తాయి. ఖర్చులు మీ రాబడికి తగినట్టుగానే ఉండగలవు. 
 
కుంభం : ఈ రోజు ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి ఒక ప్రణాళికలు రూపొందిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. మిమ్మల్ని పొగిడే వారే కానీ, సహకరించే వారుండరు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మీనం : ఈ రోజు ధనవ్యయం, చెల్లింపులకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు.