బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (21:28 IST)

2017లో మకర రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

మకర రాశివారికి ఆగస్టు వరకు ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు, ఆ తదుపరి అంతా జన్మమము నుందు కేతువు, సప్తమము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యము నుందు జూన్ వరకు వ్యయము నందు శని, ఆ తదుపరి అక్టోబరు వ

మకర రాశి : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణము 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆదాయం 11, వ్యయం 5, పూజ్యత 2, అవమానం 6. 
 
మకర రాశివారికి ఆగస్టు వరకు ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు, ఆ తదుపరి అంతా జన్మమము నుందు కేతువు, సప్తమము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యము నుందు జూన్ వరకు వ్యయము నందు శని, ఆ తదుపరి అక్టోబరు వరకు వక్రగతిన లాభము నందు, ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా "ధనం మైత్రీ బంధ నాశని" అన్న సత్యాన్ని గ్రహించి బంధుమిత్రులతో ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందీ అంటూ ఏదీ ఉండదు. ప్రతి విషయంలోనూ చూసి చూడనట్టు వదిలి వేయడం వల్ల కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. మీకు తెలియకుండానే వివాదాల్లో చిక్కుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు అన్ని విధాలా పురోభివృద్ధి కానరాగలదు. నిర్మాణ రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారు నూతన వెంచర్లు చేపడుతారు. 
 
నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికం కావడంతో ఆరోగ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో మనస్తాపం చెందుతారు. ప్రైవేట్ రంగాల్లో వారు అధికారుల తీరుతో మనస్తాపం చెందుతారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి పేరు, ఖ్యాతిగడిస్తారు. ముఖ్యుల నుంచి అందిన ఆహ్వానాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. విద్యార్థుల్లో పోటీతత్వం, ఒత్తిడి అధికమవుతుంది. రావలసిన ధనం విషయంలో జాప్యం ఎదుర్కొంటారు. రవాణా, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. 
 
స్థిరాస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య వివాదాలు తలెత్తేఆస్కారం ఉంది. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం మంచిది. రాజకీయాల్లో వారికి సదావశాకాలు లభిస్తాయి. విదేశీయాన యత్నాల్లో అధిక కృషి అనంతరం మాత్రమే సఫలీకృతులౌతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అభివృద్ధి. వ్యవసాయ రంగాల్లో వారికి వాతావరణం అనుకూలించక పోవడంతో నూనె, మిర్చి, వేరుశెనగ రైతులు ఆశించిన ఫలితాలు పొందలేరు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మీ మనోభావాలు దెబ్బతినంగా జాగ్రత్త వహించండి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాల్లో చింతన వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. స్పెక్యులేషన్ లాభదాయకం. 
 
ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ప్రారంభం అవటం వల్ల ప్రతి శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
ఈ రాశివారు ఆదిత్య పారాయణ చేయడం వల్ల లక్ష్మీగణపతిని ఆరాధించడం వల్ల దినదినాభివృద్ధి పొందుతారు. 
 
మూల నక్షత్రం వారు 'రేగి' చెట్టును పూర్వాషాఢ నక్షత్రంవారు 'నిమ్మ', ఉత్తరాషాఢ నక్షత్రం వారు 'పనస' చెట్టును ఖాళీ ప్రదేశాల్లోగానీ, దేవాలయాల్లోగానీ, విద్యా సంస్థల్లోగాని నాటికి శుభం కలుగుతుంది. 
 
ఉత్తరాషాఢ నక్షత్రం వారు 'పనస' చెట్టును, శ్రవణా నక్షత్రం వారు 'జిల్లేడు' చెట్టును, ధనిష్ట నక్షత్రం వారు 'జమ్మి' చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.