శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (17:56 IST)

2017 సింహ రాశి ఫలితాలు... ఆదాయం అబ్బో... కానీ అవమానం...

సింహ రాశివారికి ఆగస్టు వరకు మీద రాహువు, సప్తమము నందు కేతువు, ఆ తదుపరి అంతా షష్టమము నందు కేతువు, వ్యయము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా తృతీయము నందు జూన్ వరకు పంచమము నందు శని, ఆ తదుపరి వక్రగతిన అర్ధాష్టమము

సింహరాశి :  మఘ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదము 
ఆదాయం -14, వ్యయం -2 పూజ్యత -1 అవమానం-7
 
సింహ రాశివారికి ఆగస్టు వరకు మీద రాహువు, సప్తమము నందు కేతువు, ఆ తదుపరి అంతా షష్టమము నందు కేతువు, వ్యయము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా తృతీయము నందు జూన్ వరకు పంచమము నందు శని, ఆ తదుపరి వక్రగతిన అర్ధాష్టమము నందు, అక్టోబర్ నుండి తిరిగి పంచమము నందు సంచరిస్తాడు. 
 
మీ గోచారం పరీక్షించగా.. ''పూర్వా ధత్తేషు యా ధనం'' అన్నట్లుగా పూర్వజన్మ సుకృతాలతో ధనం సమయానికి అందటం, సమస్యలు అన్ని పరిష్కరించబడటం, వ్యాపార రంగాల్లో ఒకడుగు ముందుకు వెళ్ళడం ఎదుటివారిని ఆకట్టుకోవడం, దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహించడం వంటివి ఈ సంవత్సరం ఉంటాయి. మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం, పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి సంతృప్తికరంగా ఉండగలదు. మిర్చి, కంది, నూనె, స్టాకిస్టులకు పురోభివృద్ధి ఉంటుంది. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. రియల్ ఎస్టేట్ రంగాల్లో భూమికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులు, ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా పెద్దగా ఇబ్బందులుండవు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ముఖ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 
 
గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆప్తుల నుంచి శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందుకుంటారు. మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చలు, స్థిరాస్తి వ్యవహారాలు విద్యా యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. కాంట్రాక్టర్లు, అనుకున్న పనులు అర్థాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షిలవుతారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. సంఘంలో పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. హోల్‌సెల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఫ్యాన్సీ, బేకరి, తినుబండారాల వ్యాపారులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. వ్యవసాయ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
* ఈ రాశివారు ఆదిత్యుని ఆరాధించడం ద్వారా సర్పదోషాలు తొలగిపోతాయి. రుద్రుని ఆరాధించడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు గురుగణపతిని మంకెన పూలతో ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
* మఖనక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పుబ్బనక్షత్రం వారు వజ్రం, ఉత్తరనక్షత్రం వారు జాతి కెంపు ధరించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
* మఖనక్షత్రం వారు మర్రి చెట్టును, పుబ్బనక్షత్రం వారు మోదుగ, ఉత్తరనక్షత్రం వారు జువ్వి చెట్టును, దేవాలయాలలోని కానీ విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటినట్లైతే శుభం కలుగుతుంది.