మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (20:24 IST)

2017లో వృశ్చిక రాశి వారి ఫలితాలు...

వృశ్చిక రాశివారికి జూన్ వరకు ద్వితీయము నందు శని, ఆ తదుపరి వక్రగతిన జన్మమము నందు అక్టోబరు వరకు, అక్టోబరు నుంచి తిరిగి ధనస్థానము నందు, ఆగస్టు నెల వరకు చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు, ఆ తదుపరి తృతీయము నుందు కేతువు, భాగ్యము నందు రాహువు, సెప్టె

వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ 1,2,3,4 పాదాలు. జ్యేష్ట 1,2,3 పాదాలు.
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. 
 
వృశ్చిక రాశివారికి జూన్ వరకు ద్వితీయము నందు శని, ఆ తదుపరి వక్రగతిన జన్మమము నందు అక్టోబరు వరకు, అక్టోబరు నుంచి తిరిగి ధనస్థానము నందు, ఆగస్టు నెల వరకు చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు, ఆ తదుపరి తృతీయము నుందు కేతువు, భాగ్యము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు లాభము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయము నుందు సంచరిస్తారు.  
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా "నేటి కంటే రేపు సుదినం" అన్న భావంతో శ్రమించవలసి ఉంటుంది. ప్రతి పనిలోనూ, ఆటంకాలు, చికాకులు, ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పట్టుదలే మీ ఆయుధంగా ముందుకుసాగండి. కుటుంబీకుల సహకారం మీకు తోడవుతుంది. సంతానం పురోభివృద్ధి సంతృప్తినిస్తుంది. ఖర్చులు అధికం కావడంతో రుణాలు తప్పకపోవచ్చు. శుభకార్యాల్లో మీదైనగుర్తింపు పొందుతారు. కిరాణా ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ప్రథమార్థంలో చికాకులు, ఒత్తిడి, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా మార్పులు కానరాగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. కుటుంబీకుల పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
బంధువుల రాకపోలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి పార్టీ పరంగాను అన్ని విధాలుగా గుర్తింపు లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. నిర్మాణ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థుల ఉన్నత లక్ష్యాలు సాధించగలుగుతారు. 
 
సినిమా, కళాకారులకు అభిమాన బృందాలు పెరుగుతాయి. రావలసిన ధనం విషయంలో జాప్యం తప్పదు. నిరుద్యోగులకు యత్నాలు ఏమాత్రం అనుకూలించవు. వస్త్ర బంగారం, వెండి రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్ప పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. హోటల్, పానీయ, తినుబండవ్యాపారులకు అనుకోని అభివృద్ధి కానవస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. పొట్ట, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. క్రయ, విక్రయ రంగాల్లో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. కళాకారుల శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. బ్యాంకు లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. 
 
కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యుల తీరుతో మనస్తాపం చెందుతారు. ప్రైవేటు సంస్థల్లో వారికి తోటివారితో లౌక్యం అవసరం. స్థానచలనానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు అశాంతి, ఆందోళన తప్పదు. మీ చుట్టుపక్కల వారితో చిన్నచిన్న విషయాల్లో లౌక్యం అవసరం. స్పెక్యులేషన్ రంగాల వారికి కలిసి రాగలదు. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసి రాగలదు. ఆథ్యాత్మిక చింతన వాయిదా పడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులతో వాద ప్రతివాదనలకు దిగకుండా జాగ్రత్త వహించడి. వాహనం కొనుగోలు యత్నాలు నెరవేరుతాయి. 
 
మొత్తంమీద ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు అధికమైన వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు. ఈ రాశివారు సదాశివుని ఆరాధించడం వల్ల లక్ష్మీస్తోత్రం చదవడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, ఎర్రని పూలతో శనిని పూజించిన సర్వదోషాలు తొలగిపోతాయి. 
 
విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్టవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. 
 
విశాఖ నక్షత్రం వారు మొగలిమొక్కను, అనూరాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జేష్ట నక్షత్రం వారు కొబ్బరి మొక్కను నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.