శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2017 (22:18 IST)

తెలుగు నెలలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా?

మన తెలుగు నెలలు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కో నెలగా ఏర్పడ్డాయి. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు పౌర్ణమి రోజు కాగా, ఆ నెలను చైత్రంగా పిలుస్తాం చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను వైశాఖంగా పిలుచుకుంటాం. చంద్రుడు జ్యేష్ట నక్షత్రంతో కలిస్తే

మన తెలుగు నెలలు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కో నెలగా ఏర్పడ్డాయి.
చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు పౌర్ణమి రోజు కాగా, ఆ నెలను చైత్రంగా పిలుస్తాం
చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను వైశాఖంగా పిలుచుకుంటాం.
చంద్రుడు జ్యేష్ట నక్షత్రంతో కలిస్తే ఆ నెలను జ్యేష్టమాసంగా పిలుస్తాం.
చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఆషాఢంగా పిలుస్తాం.
చంద్రుడు శ్రవణా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను శ్రావణ మాసంగా పిలుస్తాం.
చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిస్తే ఆ నెలను భాద్రపద మాసంగా పిలుస్తాం.
చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఆశ్వయుజ మాసంగా పిలుస్తాం.
చంద్రుడు కృత్తిగా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను కార్తీక మాసంగా పిలుస్తాం.
చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిస్తే ఆ నెలను మార్గశిరంగా పిలుస్తాం.
చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను పుష్యమాసంగా పిలుస్తాం.
చంద్రుడు మఖా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను మాఘ మాసం అంటాం.
చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఫాల్గుణ మాసంగా పిలుస్తాం.