Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోర్న్‌ చూడటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి?

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (07:41 IST)

Widgets Magazine
porn websites

హైటెక్ యుగంలో పెక్కు మంది చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. ఇలాంటి అలవాట్లలో పోర్న్ వీడియోలు చూడటం. ఈ తరహా వీడియోలు చూడటం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో మానసిక వైద్య నిపుణులను అడిగి తెలుసుకుందాం. 
 
పోర్న్‌ వీడియోలు చూసే వ్యక్తి క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పోర్న్‌ చూసే కాలం, పోర్న్‌ (మామూలు సంభోగం నుండి హింసాత్మకమైనవాటి వరకు) స్థాయి పెరిగే కొద్దీ ఈ ఒంటరితనం పెరుగుతుంది.
 
పోర్న్‌ చూసేవారు జీవిత భాగస్వామిని గాయపరిచే అవకాశం ఎక్కువ. ఆమె ఇష్టాయిష్టాలు, ఇబ్బందులు లక్ష్యపెట్టకపోవడమే కాదు. క్రమంగా ఆమెతో మానసిక సాన్నిహిత్యానికి భయపడతారు. ఆరోగ్యకరమైన సహజ శారీరక సంబంధాలపై విముఖత ఏర్పడుతుంది. పోర్న్‌ చూస్తూ ఉండకపోతే లైంగిక తృప్తి పొందలేరు. 
 
పోర్న్‌ సినిమాలపై మాటల్లో, చర్యల్లో ఆధిపత్యాన్ని, ఉద్రేకాన్ని, హింసను చూపుతాయి. నిజానికి లైంగిక హింసను స్త్రీలు ఆనందిస్తారని చెప్పి నమ్మిస్తాయి. కాబట్టి పోర్న్‌ వ్యక్తిని లైంగిక దాడికి మానసికంగా సన్నద్ధం చేస్తుంది. ఆలోచనల్నే కాక చేతల్ని కూడా ప్రభావితం చేయగలదు. 
 
రాను రాను పోర్న్‌ మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగా మారుతున్నది. అక్రమ రవాణా నుండి వ్యభిచారం నుండి పోర్న్‌ను విడదీసి చూడటం ఎంతమాత్రం సాధ్యం కాదు. పోర్న్‌ వలన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి. కాబట్టి పోర్న్‌ను ఏ హానీ లేని వినోదంగా, భావ వ్యక్తీకరణగా చూడటం తప్పు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

60 వయస్సు వారు 20 వయస్సు వారిగా మారాలంటే...!

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ...

news

శృంగారానికి ముందు అవి తీసుకుంటే...?

ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు శృంగారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. ...

news

ఇత్తడి పాత్రల్లో భోజనం మంచిదా? బంగారు, వెండి పళ్లాల్లో అయితే?

ఆరోగ్యవంతంగా వుండేందుకు ఎలాంటి పాత్రల్లో భుజించాలన్నది ఆయుర్వేద శాస్త్రం వివరించింది. ...

news

ఆ పేస్ట్‌తో బొద్దింకలకు చెక్...

* వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ...

Widgets Magazine