1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Rush in Tirumala

తిరుమల గిరుల్లో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Tirumala
తిరుమల గిరుల్లో క్రమంగా భక్తలు రద్దీ పెరుగుతోంది. ఆదివారం 37,849 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. 15,338 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 
 
వారాంతం కావడంతోనే రద్దీ పెరిగిందని, భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వామిని దర్శించుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వారంలో సంక్రాంతి పర్వదినాలు రానున్నందున రద్దీ కొంతమేరకు తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
10-01-2021 నుంచి 16-01-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు-video