శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 22 మార్చి 2016 (12:32 IST)

''ము ము ముద్దంటే మోజే.. ఇప్పుడా ఉద్దేశం లేదే'... తొలి ముద్దు మహాద్భుతం!

''ము.. ము... ముద్దంటే చేదా? ఆ ఉద్దేశం లేదా?'' అని హీరోయిన్‌ కొంటెగా అడిగితే. ''ము ము ముద్దంటే మోజే.. ఇప్పుడా ఉద్దేశం లేదే'' అని హీరో సమాధానం చెప్పి తప్పించుకునే వాడు. నిజానికి ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ముద్దు కోసం చాలా మంది తహతహలాడుతుంటారు. అందులోను తొలి ముద్దు మహా అద్భుతంగా ఉంటుందని ప్రేమికులు అంటుంటారు.
 
ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడుకున్న ముద్దులు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. ప్రేమలో మునిగిపోయినప్పుడు మనిషి తమకంతో తన ప్రమేయం లేకనే తనకు బాగా కావలసిన వారిని ముద్దులతో ముంచెత్తుతుంటాడు. 
 
ఈ ముద్దుల ప్రక్రియ కొనసాగేముందు శరీరంలోని 34 ముఖ కండరాలు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని శాస్త్ర పరిసోధకులు తెలిపారు. ఈ కండరాలలో ప్రధానమైన కండరము పెదాలను దగ్గరగా చేసే ఆర్బిక్యులరిస్ ఓరిస్. దీనినే ముద్దుపెట్టే కండరం అని అంటారు. నేటి యువత ఫ్రెంచి ముద్దునే ఇష్టపడుతుంటారు. పెదవుల్ని పెదవులతో ముడివేస్తే అది ఫ్రెంచ్ ముద్దు అవుతుంది. దీనిని ఎక్కువమంది ఇష్టపడతారు.
 
ఇకపోతే, ఘాటైన ముద్దు పెట్టుకునే సమయంలో చాల మంది కళ్ళు మూసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా. కొంతమంది సిగ్గు పడి కళ్ళు ముసుకోవడం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై పరిశోధకులు చాలా పరిశోధనలు చేశారు. మానవ మెదడు ఒకే సమయంలో రెండు విధులను సమానంగా నిర్వహించలేదట. 
 
ముఖ్యంగా సున్నితమైన విషయంలో అవి పనిచేయలేవట. మనిషి శరీరంలో పెదవులు అన్నవి సున్నితమైన భాగాలు. పెదవులను పెదవులతో ఇనుమడించే సమయంలో మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతుంది. అలా అధిక సంఖ్యలో న్యూరాన్లు ఉత్తేజితం కావడంతో..మెదడు చూపుపై నియంత్రణను కోల్పోవడంతో మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయని పరిశోధకులు వెల్లడించారు.