సంబంధిత వార్తలు
- ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడి దెబ్బకు నష్టాల్లో స్టాక్ మార్కెట్
- యూపీలో అత్తరు వ్యాపారులను టార్గెట్ చేసిన ఐటీ శాఖ - మరో వ్యాపారి ఇంట్లో...
- ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ: 19 నుంచి సీఎం జిల్లాల పర్యటన
- జెఎస్డబ్ల్యు ట్రేడ్మార్క్స్తో అక్రమాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సోమవారం స్టాక్ మార్కెట్ మదుపరులకు షాకిచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,545 పాయింట్లు పతనమై 57,491కి దిగజారింది. నిఫ్టీ 468 పాయింట్లు కోల్పోయి 17,149కి పడిపోయింది.
అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టపోయిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసమయానికి నష్టాలను చవిచూసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ , విప్రో, టెక్ మహీంద్రా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
