దిశ కేసులో నిందితులైన నలుగురు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు సంఘటన స్థలమైన చటాన్‌పల్లికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం తెల్లవారుజామున దిశ నిందితులైన ఏ1ఆరిఫ్, ఏ2జొల్లు శివ, ఏ3జొల్లు నవీన్, ఏ4చెన్నకేశవులును చటాన్‌పల్లికి పోలీసు వ్యానులో తీసుకువచ్చారు. దర్యాప్తులో భాగంగానే అసలు సంఘటన జరిగిన స్థలంలోనే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు మేల్కొని కాల్పులు...