1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Inter Board Taking Key Decision for Students

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం - వెబ్‌సైట్‌లో మోడల్ ప్రశ్నపత్రాలు

Telangana Inter Board
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థుకు నిర్వహించి సంవత్సర పరీక్షల్లో ప్రశ్నల చాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఈ చాయిస్ ప్రశ్నల సంఖ్యను గణనీయంగా పెంచింది. 
 
గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ యేడాది అన్ని ఆప్షన్‌లలో ఈ తరహా ప్రశ్నలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. దీనికి కారణం కరోనా మహమ్మారి కారణంగా విద్యా బోధన సక్రమంగా జరగకపోవడమే. 
 
కాగా, 2021-22 సంవత్సారానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసింది. ఏదేని సందేహం ఉన్న విద్యార్థులు ఈ మోడల్ ప్రశ్నపత్రాలను చూసుకోవచ్చు. గత యేడాది మూడు సెక్షన్లలో రెండింటింలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఇపుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. 
తర్వాతి కథనం
ప్రధాని పదవిపై కేసీఆర్ కన్ను.. రాజ్యసభ స్థానానికి ప్రకాష్ రాజ్?